ఆస్తి కోసం తల్లిదండ్రులను బలవంతంగా తీసికెళ్లేందుకు కిరాయి మనుషులను పురికొల్పిన ఘటన కర్నూలు జిల్లా, వెల్దుర్తి మండలంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే... మండలంలోని మల్లెపల్లె గ్రామానికి చెందిన నేశె లక్ష్మీదేవి, నాగేశ్వరరావును సోమవారం కోడుమూరుకు చెందిన ఆరుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో మల్లెపల్లె పికెట్‌ను పరిశీలించేందుకు సీఐ యుగంధర్ తన సిబ్బందితో వెళ్లారు. ఎస్‌బి హెడ్‌కానిస్టేబుల్ ఖాజా అనుమానాస్పదంగా ఉన్న టాటా సుమోను గమనించి ఆరా తీస్తూ వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో వారిని ఆరుగురు వ్యక్తులు బెదిరిస్తూ కనిపించారు. సీఐ అక్కడికి చేరుకొని ఆ ఆరుగురిని విచారించారు. తాము బలవంతంగా వృద్ధ దంపతులను కోడుమూరు రిజిస్ర్టేషన్ ఆఫీసుకు తీసుకువెళ్లేందుకు కిరాయికి వచ్చినట్లు తెలిపారు. చిన్న కుమారుడు చిన్న తిప్ప రాజు ఈ మేరకు తమతో ఒప్పందం చేసుకున్నట్లు వారు తెలిపారు.