తాడికొండ నియోజకవర్గం, ఫిరంగిపురంలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర సురేష్ కుమార్ మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా దరఖాస్తుదారులకు కుల, ఆదాయ, తదితర సర్టిఫికేట్ లు అందజేశారు. ఈ సందర్భంగా కత్తెర సురేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జగనన్న సురక్ష కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.