ఏపీ ఇంటర్మీడియట్ కార్యాలయం వద్ద ఎస్‌ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థుల బుధవార ధర్నాకు దిగారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని విద్యార్థుల డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని.. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. అరెస్టును ఎస్ఎఫ్ఐ నేతలు, విద్యార్థులు తీవ్రంగా ఖండించారు. కళాశాలల్లో లెక్చరర్ పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల విద్యార్ధులు చదువులో వెనుకబడుతున్నారని.. కళాశాలల్లో వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఎస్‌ఎఫ్‌ఐ విమర్శించారు. కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామిలను సీఎం జగన్ విస్మరించారన్నారు. వెంటనే ఇంటర్మీడియట్ కళాశాలల్లో సమస్యలు పరిష్కరించాలని.. సమస్యలు వెంటనే పరుష్కరించని పక్షంలో సీఎం ఇంటిని ముట్టడిస్తామని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు.