పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసం ఢిల్లీలో దళారిలా మారిపోయారంటూ మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ దళపతి కాదు, దళారి.. జనసైనికులు, మెగా ఫ్యాన్స్ పవన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటుంటే.. ఆయన మాత్రం చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని కంకణం కట్టుకున్నారన్నారు. అందుకే కాపులకు, జనసేన పార్టీ కార్యకర్తలకు పవన్ క్షమాపణలు చెప్పాలన్నారు. పవన్ పొత్తు పెట్టుకోవడానికి కొత్త పార్టీలు లేక మళ్లీ టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని.. ఆయన మీడియా ముందు హీరో.. రాజకీయాల్లో జీరో అంటూ సెటైర్లు పేల్చారు.
జనసేనాని గతంలో ఏ పార్టీతోనూ పొత్తుపెట్టుకోను.. గొంతు కోసుకుంటా అన్నారని.. ఇప్పుడేమో పొత్తులు అని ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. సిగ్గులేకుండా అందరి కాళ్లు పట్టుకుంటున్నారని.. చంద్రబాబు ఎన్ని లేఖలు రాసినా ఎన్డీయే సమావేశానికి పిలుపు రాలేదన్నారు. చంద్రబాబు ఎంత ఊసరవెల్లో బీజేపీకి బాగా తెలుసని.. గతంలో రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తానన్న బాబు.. కాంగ్రెస్‌ను కూడా మోసం చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు మోసగాడు అని తెలుసు కాబట్టే బీజేపీ నాయకత్వం ఎన్డీఏ భాగస్వామ్య సమావేశానికి ఆహ్వానించలేదన్నారు.
ప్రధాని మోదీని తిట్టిన చంద్రబాబుని ఎన్డీయే సమావేశానికి పిలవలేదరన్నారు. కానీ, తల్లిని తిట్టించిన చంద్రబాబు కోసం పవన్ కలిసిపోయారన్నారు. పవన్ కళ్యాణ్ తన తల్లిని తిట్టినవారి కోసం దళారిగా మారడం సిగ్గు చేటన్నారు. సిగ్గులేకుండా మూడు పార్టీలతో కలిసి పోటీచేస్తామని పవన్ అంటున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఎన్డీఏ సమావేశానికి వెళ్లింది చంద్రబాబు కోసమే అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుకోసం తెగ కష్టపడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఊసరవెల్లి.. అలాంటి వ్యక్తి కోసం పాకులాడటం.. ఢిల్లీలో అందరి కాళ్లు పట్టుకోవడం అంతకంటే మరో దౌర్భాగ్యం ఏమీ ఉండదన్నారు.
పవన్‌కళ్యాణ్‌కి ఫ్యాన్స్ ఉంటారేమో.. మా జగనన్నకి సోల్జర్జ్ ఉంటారు.