దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల వేళ అవసరమైతే తప్పా బయటికి రావద్దు. నడిచేటప్పుడు మ్యాన్ హోల్స్, విద్యుత్ స్థంభాలను చూసుకొని నడవాలి. ఇనుప దండాల పై బట్టలు ఆరేయవద్దు. బావుల వద్ద చెట్ల కింద నిలబడొద్దు. పిడుగులు పడే ప్రమాదం ఉంటుంది. రైతులు, ఇళ్లలో ఉండేవారు విద్యుత్ సమస్యలుంటే అధికారులకు చెప్పాలి కానీ స్వతహాగా రిపేర్ చేయవద్దు. ఎర్త్ లు,షాక్స్ తగిలి చనిపోయే ప్రమాదం ఉంటుంది. జలాశయాల వద్ద అలర్ట్ గా ఉండాలి. జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దు. వాహనాలు నడిపే వారు జాగ్రత్తగా ఉండాలి.