ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువ మెట్ట నల్లమల అటవీ ప్రాంతంలో బుధవారం కారు, లారీ ఎదురెదురుగా ఢీకొన్న సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనలో కారులో ఉన్న ఇద్దరికీ స్వల్ప గాయాలు అయ్యాయి. మూలమలుపు వద్ద వాహనదారులకు వాహనాలు కనిపించక ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనలో కారు ముందు భాగం భారీగా ధ్వంసం అయింది. వేగ నియంత్రణతో ఉండడం వల్ల భారీ ప్రమాదం తప్పిందని వాహనదారులు తెలిపారు.