మణిపుర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్న వీడియోను తొలగించాలని ట్విట్టర్ సహా అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాంలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఘటనపై దర్యాప్తు జరుగుతున్నందున సామాజిక మాధ్యమాలు భారత చట్టాలకు అనుగుణంగా వ్యవహరించాలని తెలిపింది.