బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని తుఫాన్ల హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో అల్పపీడనం కదులుతోందన్నారు. దీన్ని ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయిందని తెలిపారు. ఈ పరిస్థితి మరో ఐదు రోజులపాటు కొనసాగుతుందని వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎల్లో వార్నింగ్ ప్రకటించామన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదు అంటూ తుఫాన్ల హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద హెచ్చరికలు జారీ చేశారు.