ఏపీలోని అమరావతి కేంద్రంగా పరిగణించి పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం సేకరించిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. డీజిల్, పెట్రోలు ధరల్లో అన్ని రాష్ట్రాల కన్నా ఏపీ అగ్రభాగాన నిలిచిందని తెలిపారు. ఏపీలో పెట్రోల్ లీటరుకు రూ. 111.87, డీజిల్ రూ. 99.61గా ఉన్నట్లు పార్లమెంట్‌కు కేంద్రం నివేదించింది. డీజిల్ కూడా అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువ ధర ఉందని తెలిపింది. పెట్రోల్ ధరల్లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో ఉండగా.. డీజిల్ ధరల్లో రెండో స్థానంలో నిలిచింది. డీజిల్ ధరల్లో లక్షద్వీప్ మాత్రం తొలి స్థానంలో ఉందని కేంద్రం పేర్కొంది. దేశంలో అన్ని ప్రాంతాల్లో చమురు ధరలు ఒకేలా ఉండే విధానం ఇప్పటివరకూ ఏదీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణలో మాత్రం పెట్రోల్ లీటరుకు రూ. 109.66, డీజిల్ రూ. 97.82 ఉన్నట్లు కేంద్రమంత్రి తెలిపారు.