ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల కోసం జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ హయాంలో ఉన్న అన్నా క్యాంటిన్లు తొలిగించారనే విమర్శలకు చెక్ పెడుతూ.. రాష్ట్రంలో ఆహా క్యాంటిన్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ క్యాంటిన్లను అందబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్యాంటిన్ల నిర్వహణ బాధ్యతను మహిళా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు అప్పగిస్తున్నారు. ఇప్పటికే జగనన్న మహిళా మార్టులు, అర్బన్ మహిళా మార్కెట్లను ఏర్పాటు చేసి సమాఖ్య సభ్యులతో దిగ్విజయంగా నడిపిస్తున్న ఈ సంస్థ ఇప్పుడు మరింత మంది పట్టణ మహిళా సమాఖ్య సభ్యులకు ఉపాధిని చూపించాలనే లక్ష్యంతో ‘ఆహా’ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ క్యాంటిన్లు ప్రారంభంకాగా.. ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తుందని చెబుతున్నారు.
ప్రజలకు తక్కువ ధరలో మంచి ఆహారం అందించే లక్ష్యంతో ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నారు. అవసరాన్ని బట్టి మరిన్ని ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. లాభాలను నిర్వాహకులే తీసుకుంటారు.. టౌన్ లెవెల్ ఫెడరేషన్ అకౌంట్‌లో జమచేసే నగదును సంఘ సభ్యులు రుణాలుగా తీసుకుంటారు. ఇలా ప్రతి రూపాయి ఆ పట్టణంలోని సంఘ సభ్యులే తీసుకునేలా చేస్తున్నారు.. నిర్వహణ పర్యవేక్షణను మెప్మా సిబ్బంది చూస్తారు. ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ క్యాంటిన్లలో సాయంత్రం వేళ జొన్న, సజ్జ రొట్టెలు, భోజనం పెట్టారట.. ఒక్కపూటలోనే మంచి ఆదాయం వచ్చిందంటున్నారు. ఆ తర్వాత ఉదయం టిఫిన్లు కూడా పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa