ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆయనకు పందేలంటే ఇష్టం,,,పెద్ద కర్మ రోజు కోడి పందేలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 21, 2023, 08:34 PM

బలగం సినిమా తరహాలోనే.. కృష్ణా జిల్లా గుడివాడలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. విజయవాడ రూరల్‌ మండలం నున్న ప్రాంతానికి చెందిన కొండాపి నరేంద్రరెడ్డికి కోడిపందేలంటే చాలా ఇష్టం. ఆయన సన్నిహితుల్లో ఎక్కువమందిది కూడా అదే దారి. ఇటీవల ఆయన మరణించారు.. గురువారం ఆయన పెద్దకర్మ నిర్వహించారు. ఈ క్రమంలో ఆ చుట్టు పక్కల గ్రామాల్లో ఉండే సన్నిహితులు, కోళ్ల పందేల రాయుళ్లు.. ఆయనకు ఇష్టమైన కోడిపందేలు నిర్వహించేందుకు భారీగా ప్లాన్ చేశారు.


సూరంపల్లి సమీపంలో ఓ మామిడి తోటలో పందేలకు ఏర్పాట్లు చేశారు. పోలవరం కట్ట సమీపంలో ఆయన ఫొటో కూడా పెట్టారు. ఈ విషయం తెలిసి కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా ఆధ్వర్యంలో ఎస్‌ఈబీ బృందం.. తోటలోని కోడి పందేల శిబిరంపై మెరుపు దాడి చేసింది. అక్కడ మొత్తం 74 మందిని అదుపులోకి తీసుకుని.. వారి నుంచి రూ.10,98,720 డబ్బులు, 8 కార్లు, 6 కోళ్లు, 48 కత్తులను స్వాధీనం చేసుకున్నారు.


అరెస్ట్ చేసిన వారందరినీ స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేశారు. అలాగే కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. కోడిపందేలను అమితంగా ఇష్టపడే ఓ వ్యక్తి పెద్దకర్మ రోజున ఇలా భారీ స్థాయిలో పందేలు నిర్వహిస్తే ఆయన ఆత్మ శాంతిస్తుందనే ఇలా చేశారనే టాక్ వినిపిస్తోంది. కానీ కథ అడ్డం తిరగడంతో పోలీసులకు దొరికిపోయారు. ఈ వ్యవహారం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో హాట్ టాపిక్ అయ్యింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa