ఏపీ సచివాలయ మహిళా పోలీసులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహిళా పోలీసులుగా పిలిచే మహిళా సంక్షేమ కార్యదర్శులకు ఇకపై పోలీసు విధులు కేటాయించరాదని నిర్ణయించారు. ఈ మేరకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి జిల్లా ఎస్పీలకు ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు శాఖలో బందోబస్తు, రిసెప్షన్, శాంతి భద్రతలు వంటి సాధారణ విధులకు మహిళా పోలీసులను వినియోగించడం లాంటివి చేయకూడదని ఆదేశించారు.