రాష్ట్రంలో ఎడతెరప లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు, వాగులు వంతెనలతో పాటు గోదావరి వరద బాగా పెరుగుతోంది. ఇందుమూలంగా భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. దీనితో గోదావరి పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. అలానే ధవళేశ్వరం వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుత ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 10.02 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. అధికారులను ఎప్పటికప్పుడు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేస్తోంది. సహాయక చర్యల్లో 3 ఎన్‌డీఆర్ఎఫ్, 4 ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. ఇక అత్యవసర సహయం కోసం 24 గంటలు అందుబాటులో స్టేట్ కంట్రోల్ రూమ్ నంబర్లు 1070, 112, 18004250101 ఉండనున్నాయి.