రాష్ట్రంలో వైసీపీ నాయకుల అరాచకాలకు, అక్రమాలకు హద్దు లేకుండా పోయింది అన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తపరిచారు. ఇసుక దోపిడీ కోసం అన్నమయ్య ప్రాజెక్టును బలి పెట్టారని అయన ధ్వజమెత్తారు. పిచ్చి పరాకాష్ఠకు చేరి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ తెలుగు గంగ ప్రాజెక్టు చేపట్టినప్పుడు.. నేను పట్టిసీమ మొదలు పెట్టినప్పుడు ఎగతాళి చేశారు. ఈ రెండూ సీమ జీవితాల్లో వెలుగు తెచ్చాయి. టీడీపీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు.. మోసాలు, కుట్రలు, కులాలతో ప్రాంతీయ ఉద్యమాలు తెచ్చారు. సీమకు ఎవరు ద్రోహం చేశారో.. ఎవరు మేలు చేశారో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి’ అని కోరారు.