ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతంగా పెరుగుతుంది. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 13.4 అడుగులకు నీటిమట్టం పెరిగినట్లు అధికారులు తెలిపారు. డెల్టా పంట కాల్వలకు 4 వేల క్యూసెక్కులు, సముద్రంలోకి 12.24 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.