నేను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్ మినీ జపాన్‌గా మారుతోందని చెప్పాను కానీ ఆ సమయంలో చాలా మంది నన్ను ఎగతాళి చేశారని, కానీ నేడు మీరు (ప్రజలు) దాన్ని సాధించారని రాజ్‌కోట్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ అన్నారు.రాజ్‌కోట్ ఎమ్మెల్యేగా తనకు తొలిసారి ఓటు వేశారని, ఆ నగరం తనకు ఎంతో నేర్పిందని ప్రధాని గుర్తు చేసుకున్నారు.ఈరోజు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో 860 కోట్ల రూపాయలతో రాజ్‌కోట్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు బహుళ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. కొత్తగా ప్రారంభించబడిన రాజ్‌కోట్ అంతర్జాతీయ విమానాశ్రయం యొక్క టెర్మినల్ భవనాన్ని కూడా ప్రధాన మంత్రి సందర్శించారు.ప్రాజెక్టులను పూర్తి చేయడం వల్ల ఈ ప్రాంతంలోని డజన్ల గ్రామాలకు తాగు, సాగునీటికి నీరు అందుతుందని అన్నారు. గత 9 సంవత్సరాలలో, ప్రతి సామాజిక వర్గం మరియు ప్రాంతం యొక్క జీవితాలను సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేసిందని ప్రధాన మంత్రి అన్నారు.