పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు ప్రకటించారు. 2019 మార్చి నాటికి రాష్ట్ర అప్పు రూ.2,64,451 కోట్లుగా ఉందన్నారు. 2023 నాటికి అప్పు రూ.4,42,442 కోట్లకు చేరిందని వెల్లడించారు. ఈ నాలుగేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.1,77,991 కోట్లకు చేరుకుందని వివరించారు.