పాకిస్తాన్ అంటే ఉగ్రవాదం...ఉగ్రవాదం అంటే పాకిస్తాన్ అన్నట్లుగా నేడు ప్రచారంలోనున్నది. ఉగ్రవాద వ్యతిరేక చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ పాకిస్థాన్ పై పాశ్చాత్య దేశాలకు అనుమానాలు తొలగిపోవడంలేదు. తాజాగా, ఈఏఎస్ఏ (యూరోపియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ) చేసిన హెచ్చరికే అందుకు నిదర్శనం. పాక్ గగనతలంలో ప్రయాణించేటప్పుడు తక్కువ ఎత్తులో వెళ్లవద్దని ఈఏఎస్ఏ విమానయాన సంస్థలను అప్రమత్తం చేసింది. పాక్ గగనతలంలో 260 అడుగుల కంటే తక్కువ ఎత్తులో పయనించడం అంటే ప్రమాదాన్ని ఆహ్వానించడమేనని పేర్కొంది.
పాక్ లో పలు ముష్కర మూకలు ఉన్నాయని, వారి వద్ద పోర్టబుల్ విమాన విధ్వంసక ఆయుధాలు ఉన్నాయని వెల్లడించింది. ముఖ్యంగా, వారి వద్ద తక్కువ ఎత్తులో వెళ్లే విమానాలను కూల్చగల శక్తిమంతమైన ఆయుధాలు (మొబైల్ రాకెట్ లాంచర్లు, మ్యాన్ ప్యాడ్స్) ఉన్నాయని ఈఏఎస్ఏ స్పష్టం చేసింది. ఈ ప్రకటన వచ్చే ఏడాది జనవరి 31 వరకు వర్తిస్తుందని పేర్కొంది. అయితే, ఈఏఎస్ఏ ప్రకటను పాకిస్థాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ, పాకిస్థాన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఆపరేటర్ల సంఘం (ఏఓఓఏ) తప్పుబట్టాయి. పాకిస్థాన్ గగనతలం ప్రమాదకరమైనదని పేర్కొనడం అర్థరహితమని, ఈఏఎస్ఏ ఆ ప్రకటనను వెనక్కి తీసుకోవాలని ఏఓఓఏ డిమాండ్ చేసింది. పాక్ గగనతలం అన్ని రకాల విమానయాన కార్యకలాపాలకు సురక్షితం అని పాక్ సివిల్ ఏవియేషన్ అథారిటీ పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa