కుల ఆధారిత సర్వే విషయంలో బీహార్ ప్రభుత్వానికి ఊరట దక్కింది. దీనికి వ్యతిరేకంగా దాఖలైన అన్ని పిటిషన్లను పాట్నా హైకోర్టు మంగళవారం కొట్టేసింది. రాష్ట్రంలో కుల ఆధారిత సర్వేకు హైకోర్టు మార్గం సుగమం చేసింది. దీనిపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని పిటిషనర్ల తరుపు న్యాయవాది దిను కుమార్ అన్నారు. బీహార్ ప్రభుత్వం జనవరి 7న కుల ఆధారిత సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించింది.