విశాఖపట్నం అభివృద్ధికి మరింత దోహదపడుతూ, మరింత మంచి జరిగిస్తూ ఆణిముత్యంలా నిలిచిపోయే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాం. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మాల్ నిర్మాణానికి విశాఖ వేదిక అయ్యింది. విశాఖ నగరం రూపురేఖలు మార్చే గొప్ప ప్రాజెక్టుగా ఇది నిలిచిపోతుంది’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. విశాఖ నగరంలోని కైలాసపురం వద్ద రూ.600 కోట్లతో రహేజా గ్రూప్ నిర్మిస్తున్న దక్షిణ భారత అతిపెద్ది ఇనార్బిట్ మాల్ నిర్మాణానికి సీఎం వైయస్ జగన్ శంకుస్థాపన చేశారు. ఈ మాల్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 8 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం వైయస్ జగన్ మాట్లాడారు.