తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డపనేని రాజా నాయుడు పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మంగళవారం మధ్యాహ్నం పొదిలి మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్థానిక ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పొదిలి మండలంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్క నాయకుడు తమ వంతు కృషి తప్పక చేయాలని అన్నారు.