కేరళలో కొత్త జంట ప్రమాదవశాత్తు నదిలో పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన శనివారం జరిగింది. తిరువనంతపురంలోని పళ్లిక్కల్ నది వద్ద ఓ కొండపై నిలబడి ఫోటోలు తీసుకుంటుండగా అదుపు తప్పి పడిపోయారు. వీళ్లను కాపాడేందుకు ఓ బంధువు నీళ్లలో దూకగా అతను కూడా చనిపోయాడు. అగ్నిమాపక సిబ్బంది ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. వారం క్రితమే వీరి పెళ్లి జరగ్గా, బంధువు ఇంట్లో ఫంక్షన్ అటెండ్ అయ్యేందుకు వచ్చారు.