సబ్సిడీపై టమాటాల సరఫరా మూన్నాళ్ల ముచ్చట కావడంతో ప్రజలు మళ్లీ అధిక ధరలకు కొనాల్సి వస్తోంది. టమాటా రూ. 220 తోపాటు కోడిగుడ్డు రూ. 10, పచ్చి మిర్చి రూ. 130 పలుకుతున్నాయి. మార్కెట్లు, మాల్స్ నుండి ఇవి వీధులు, చిరు దుకాణాల్లో విక్రయాలకు వచ్చేసరికి ఇంకాస్త పెరుగుతున్నాయి. గతంలో రూ. 20-30 వరకున్న కూరగాయల ధరలు ఇప్పుడు రూ. 60-80 పలుకుతున్నాయి. చివరికి 130 గ్రాముల పెరుగు ప్యాకెట్ ధర రూ. 12కు అమ్ముతున్నారు.