గుత్తి మున్సిపాలిటీలో తాగునీటి సమస్య పరిష్కరించాలని ప్రజా సంఘాలు, వామపక్షాలు ప్రతిపక్షాల ఆధ్వర్యంలో శనివారం ఆర్అండ్బి బంగ్లాలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు జగదీష్, ప్రజా సంఘాల నాయకులు జిలాన్, మాట్లాడుతూ తాగునీటి సమస్య వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు స్పందించి తాగునీటి సమస్య తీర్చాలని లేని పక్షంలో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు.