వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో రైతు సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని జిల్లా ఇంచార్జి మంత్రి డా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం అనంతపురం కలెక్టరేట్ లో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో సూక్ష్మ సాగునీటి పథకం కింద కళ్యాణదుర్గం, గుంతకల్లు నియోజకవర్గాలకు సంబంధించిన డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలను మంత్రి ఉషాశ్రీచరణ్, తదితరులతో కలిసి జిల్లా ఇంచార్జి మంత్రి రైతులకు పంపిణీ చేశారు.