ఎన్టీఆర్ జిల్లాలో అన్నదమ్ముల ఆత్మహత్యాయత్నం కలకలంరేపింది. విస్సన్నపేటకు చెందిన మనోహర్‌కు.. ములకలపాటివారి గూడెంకు చెందిన యువతితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. కొంతకాలం తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నారు.. అయితే ప్రియురాలు తీరు నచ్చకపోవడంతో మనోహర్ ఆమెను దూరం పెట్టాడు. ఈ క్రమంలో ఆ యువతి మనోహర్‌పై కేసు పెట్టగా.. కొంతకాలం మనోహర్ శిక్ష కూడా అనుభవించాడు. ఆ తర్వాత మనోహర్ ప్రియురాలికి దూరంగా వేరే ప్రాంతంలో ఉంటున్నాడు.
ఆ యువతి మనోహర్ సోదరుడు నరేష్‌పై కూడా విస్సన్నపేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదూంది. దీంతో నరేష్, మనోహర్ మనస్తాపంతో విసన్నపేటలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిని కుటుంబసభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అపస్మారకస్థితిలోకి వెళ్లిన ఇద్దరినీ మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకోవటంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ యువతి కేసులు పెట్టడంతో పాటూ కొంతకాలంగా ఇద్దర్ని వేధిస్తున్నట్లు బాధితుల కుటుంబం ఆరోపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa