అనంతపురం జిల్లాలోని రాయదుర్గం ఎస్బీఐ బ్యాంకులో ఘరానా మోసం బయటపడింది. వివరాల్లోకి వెళ్ళితే.... ఒక కోటి ఆరు లక్షల రూపాయలను కుటుంబ సభ్యుల అకౌంట్లోకి మేనేజర్ ఫణి కుమార్ ట్రాన్స్ఫర్ చేసినట్లు ఉన్నతాధికారులు విచారణలో బయటపడింది. బ్యాంక్ అకౌంట్కు ఫోన్ నెంబర్ లింక్, బ్యాంకుకు తరచుగా రాని ఖాతాదారుల అకౌంట్లోని నగదుపై కన్నేసి కుటుంబ సభ్యుల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. దీనితో పోలీసులు కేసు నమోదు చేశారు.