ఏలూరు జిల్లాలో ఒక అమానుష ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే.... చాట్రాయి మండలం టి.గుడిపాడు గ్రామంలో పూరి గుడిసెలో వృద్ధ దంపతులు జీవనం సాగిస్తున్నారు. తమ పెంపుడు కోడి ఇంటి పరిసరాలలో కనిపించకపోవడంతో సమీపంలో నివసిస్తున్న ఇంటి కుటుంబసభ్యులను వృద్ధురాలు అడిగింది. అయితే దొంగతనం నేపాన్ని తమపై మోపిందని భావించిన సదరు కుటుంబసభ్యులు వృద్ధురాలిపై ఆగ్రహంతో వృద్ధురాలు అని చూడకుండా తీవ్రంగా కాళ్ళతో కొట్టి, రోడ్డుపై ఇడ్చుకెళ్ళి పడేశారు. సమాచారం తెలుసుకున్న వృద్ధురాలి బంధువులు వెంటనే అక్కడకు చేరుకుని తీవ్రగాయాలతో రోడ్డుపై పడిఉన్న వృద్దురాలిని నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.