ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టం కమిటీ సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 08, 2023, 07:09 PM

అనంతపురం జిల్లా కలెక్టర్ యం. గౌతమి అధ్యక్షతన రెవెన్యూ భవనంలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టం 1994 మరియు రూల్స్ 1996 అమలుకు సంబంధించి మంగళవారం జిల్లాస్థాయి జాయింట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బాలికల నిష్పత్తి తక్కువగా ఉన్నటువంటి మండలాలు మరియు గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఆడ పిల్లల ప్రాముఖ్యతను గూర్చి తెలపాలని ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com