పిఎం స్వానిధి పథకం కింద చిరు వ్యాపారులకు బ్యాంకులు విరివిగా రుణాలు అందిస్తాయని ఐతే ఆ రుణాలను సక్రమంగా చెల్లిస్తే బ్యాంకులు మరింతగా ఎక్కువ రుణాలు అందిస్తాయని మున్సిపల్ కమిషనర్ వి. మల్లికార్జున అన్నారు. మంగళవారం గుంతకల్లు పట్టణంలోని పొదుపు పట్టణ సమాఖ్య భవనంలో పిఎం స్వానిధి పథకంపై వీధి వ్యాపారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మెప్మా టిపిఆర్ఓ మోహన్, బ్యాంకుల అధికారులు తదితరులు పాల్గొన్నారు.