మిరప సాగు చేసే రైతులు యాజమాన్య, సస్యరక్షణ చర్యలు పాటించాలని ఉద్యాన శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మంగళవారం దర్శిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా శాస్త్రవేత్తలు శివ, రాజేష్ చౌదరి, ఉష మాట్లాడుతూ మిరప రైతులు వాతావరణ పరిస్థితులు అనుగుణంగా సాగు విస్తీర్ణం పెంచుకోవాలని సూచించారు. చీడపీడల నివారణకు శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు పాటించాలని చెప్పారు.