రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాచార ఘటనలకు పాల్పడిన వారికి, గతంలో ఇలాంటి చరిత్ర ఉన్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వబోమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దీని కోసం ప్రతి మహిళా పోలీస్ స్టేషన్ లో లైంగిక నేరస్థుల జాబితాను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉద్యోగానికి ఎంపిక చేసే ముందు స్థానిక పోలీస్ స్టేషన్లు లేదా సర్కారు జారీ చేసిన ధ్రువపత్రాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.