ఏపీ సీఎం జగన్ వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా నిధులను బుధవారం విడుదల చేశారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి, పేదింటి వధువుల తల్లుల ఖాతాలో నిధులను జమ చేశారు. దీని కోసం 141.60 కోట్ల నిధులు వెచ్చించామని, 18,883 మంది జంటలకు ప్రయోజనం చేకూర్చామని చెప్పారు. ఏప్రిల్ తర్వాత వివాహాలు జరిగిన లబ్ధిదారులకు ఈ పథకాలు వర్తిస్తాయన్నారు.