ఏపీలోని గుడివాడలో బుధవారం ఉద్రిక్తత నెలకొంది. ఏపీ ప్రభుత్వం సినిమా నటుల ఆదాయంపై కాకుండా ప్రత్యేక హోదా, ప్రజల సంక్షేమం వంటి అంశాలపై దృష్టి సారించాలని చిరంజీవి ఇటీవల అన్నారు. దీనిపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందిస్తూ 'సినిమా ఇండస్ట్రీలోని ప్రతి పకోడీ గాడు సలహాలు ఇచ్చే వాడే' అన్నారు. దీంతో కొడాలి నాని క్షమాపణ చెప్పాలని గుడివాడలో ర్యాలీ చేపట్టారు. పోలీసులకు, చిరు ఫ్యాన్స్‌కు మధ్య తోపులాట జరిగింది.