కొత్తపల్లె పంచాయతీ సుందరయ్య కాలనీ సమీపంలోని పేదల ఇళ్ళ స్థలాలు కేటాయించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బి. రామయ్య, పట్టణ కార్యదర్శి సుబ్బరాయుడు కోరారు. ప్రొద్దుటూరు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు తహసీల్దార్ నజీర్ అహ్మద్ కు వినతి పత్రం సమర్పించారు.