పులివెందుల, వేముల గ్రామ పొలంలో వ్యవసాయ బావుల కింద రైతులు సాగు చేసిన పత్తి పంటను రైతులు తొలగించవద్దని బుధవారం వేముల ఆర్బీకే వ్యవసాయ అధికారిణి కె. హారిక తెలిపారు. ఏప్రిల్లో సాగు చేసిన పంటకాలం అయిపోవడంతో కొంతమంది పత్తి పంటను రైతులు తొలగిస్తున్నారన్నారు. కానీ పత్తి పంటకు క్రాప్ ఇన్సూరెన్స్ చేయడానికి త్వరలో పొలాల వద్దకు వ్యవసాయ శాఖ అధికారులు వస్తారన్నారు. అంతవరకు రైతు పత్తి పంటను తొలగించవద్దన్నారు.