చిత్తూరు జిల్లా పుంగనూరులో చంద్రబాబు రౌడీలా, గూండాలా వ్యవహరించారని, వయసు పెరిగిన ఆయన ఇలా మాట్లాడటం దారుణమని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. ‘కొట్టండి నా కొడుకులను’ అంటూ టిడిపీ కార్యకర్తలను పోలీసులపైకి ఉసిగొలిపారని విమర్శించారు. వాళ్లు కొడుతుంటే పోలీసులు సమన్వయంతో వ్యవహరించారు. వారికి సెల్యూట్ చేయాలన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేయాలని.. సీఎం జగన్ సింహం.. సింగిల్‌గా వస్తారన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ప్రజలకు ఏం చేస్తారో చెప్పి ఓట్లు అడగాలని.. అలా కాకుండా జగన్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు.