కర్నూలు నగరంలోని పోలీస్ కళాశాల సమీపంలో రమేష్ ఆచారి అనే బంగారు వ్యాపారి బుధవారం రాత్రి గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కోల్స్ కళాశాల సమీపంలో వంట సామగ్రి అమ్మే వ్యక్తుల నుంచి కత్తిపీట తీసుకుని ఒక్కసారిగా గొంతు కోసుకున్నాడు. స్థానికులు గుర్తించి వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా రమేష్ ఆచారి స్థానిక షరాబ్ వీధిలో బంగారు వ్యాపా రం చేసేవాడని టూటౌన్ పోలీసులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.