చంద్రబాబుపై అక్రమ కేసులను ఎత్తివేయాలని టీడీపీ నాయకులు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, కలిదిండి మట్టగుంటలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఎఫ్ఐఆర్ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి అండ్రాజు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల కోసం పాటు పడే చంద్రబాబుపై హత్యాయత్నం కేసు పెట్టడం దారుణమన్నారు. కక్ష సాధింపులో భాగంగానే అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. చంద్రబాబుపై కేసులు ఎత్తివేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. టీడీపీ నాయకులు నాగిడి వీరబ్రహ్మం, కొప్పనాతి వెంకటేశ్వరరావు, మోకా రామారావు, టి.సత్యనారాయణ, లక్ష్మీనారాయణ, పరశు రాముడు, నరసింహస్వామి, తాతయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.