చిలకలూరిపేట మండలం మద్దిరాల జవహర్ నవోదయ విద్యాలయలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో చేరేందుకు నిర్వహించే -ప్రవేశపరీక్ష దరఖాస్తు గడువును ఈ నెల 17వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ నల్లూరి నరసింహారావు గురువారం తెలిపారు. నవోదయ విద్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు సుమారు 2వేల వరకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయని చెప్పారు.