పోలీసుల ఆంక్షల నడుమ విశాఖపట్నంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. ఎట్టకేలకు పవన్ రుషికొండను పరిశీలించారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. ‘‘ఉత్తర ఆంధ్రా దోపిడీకి గురవుతోంది.. రుషికొండపై నిర్మాణాలకు అనుమతులు వచ్చాయా.. తుపాన్లు వచ్చినప్పుడు రుషికొండ కాపాడుతుంది. ఉత్తరాంధ్ర భూములు, ఆస్తులపై వైసీపీ నేతల కళ్లు పడ్డాయి. తెలంగాణను కూడా ఇలాగే దోచేశారు. జగన్కు ఎన్ని ఇళ్లు కావాలి?’’ అని ప్రశ్నించారు. చట్టాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ఆయనే వాటిని ఉల్లంఘిస్తున్నారని, ఈ విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.