మండలంలోని మేడాపురం గ్రామంలో హిందూ, ముస్లింలు సంయుక్తంగా మొహర్రం వేడుకలను ఆదివారం అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా జరుపుకున్నారు. వారం రోజులుగా పీర్ల చావిడిలో కొలువుదీరిన పీర్ల దేవుళ్ళకు ముల్లాసాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు, భక్తులు స్వాములకు చక్కెర, పానకం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. యువకులు పీర్ల చావిడి వద్ద ఏర్పాటు చేసిన పీర్ల గుండం చుట్టూ చిందులు వేస్తూ సంబరాలను జరుపుకున్నారు.