తిరుపతి పరిసర అటవీ ప్రాంతాల్లో భారీ ఎత్తున ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. రూ.2 కోట్లు విలువైన 51 దుంగలు, ఒకటిన్నర టన్ను ఏ గ్రేడ్ ఎర్ర చందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 48 మంది నిందితులను అధికారులు అరెస్టు చేశారు. కూంబింగ్‌లో 50 మంది అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 6 టూ వీలర్లు, 2 కార్లు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. కీలక నిందితుడు చెన్నై వాసిగా గుర్తించినట్టు టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ చెంచుబాబు వెల్లడించారు.