ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన అవినాష్ రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 14, 2023, 08:48 PM

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. వివేకా హత్య కేసులో కోర్టుకు రావాల్సిందిగా గత నెల 14వ తేదీన వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. దీంతో ఇవాళ ఆయన కోర్టు ముందు హాజరయ్యారు. అవినాష్‌తో పాటు వైఎస్ భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ హాజరయ్యారు. వీరిని విచారించగా.. తదుపరి విచారణ వచ్చే నెల 1వ తేదీకి వాయిదా పడింది.


వివేకా హత్య కేసులో అనుబంధ ఛార్జిషీట్‌ను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీని ప్రకారం విచారణ చేపడుతోంది. అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్‌ రెడ్డిపై సీబీఐ ఛార్జిషీట్ వేసింది. ఇందులో ఎనిమిదో నిందితుడిగా అవినాష్ రెడ్డిని చేర్చింది. 145 పేజీలతో మూడో ఛార్జ్‌షీట్ కోర్టులో సీబీఐ వేయగా.. జూన్ 19 తేదీన సీబీఐ డైరెక్టర్‌కు అవినాష్ లేఖ రాశారు. దర్యాప్తును పునః సమీక్షించాలని లేఖలో కోరారు. గత దర్యాప్తు అధికారి రాంసింగ్‌పై ఆరోపణలు చేసిన అవినాష్.. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సీబీఐ దర్యాప్తు సరిగ్గా జరగలేదని లేఖలో అవినాష్ రెడ్డి ఆరోపించారు. వాటిపై మరోసారి పునఃపరిశీలన చేయాలని సూచించారు. కానీ అవినాస్ లేఖపై సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వివేకా కేసులో ఇప్పటికే పలుమార్లు అవినాష్ సీబీఐ విచారణకు హాజరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com