మన్యం జిల్లా సీతంపేట మండలం కుడ్డపల్లి సమీపంలో సోమవారం ఆటో ఢీకొన్న ఘటనలో బూర్జ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి(18) మృతి చెందింది. సీతంపేట పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బూర్జ మండలానికి చెందిన ఓ వ్యక్తితో ద్విచక్ర వాహనంపై ఆ యువతి సీతంపేటలోని పర్యాటక ప్రాంతాలను చూసేందుకు వెళ్లి, తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందగా, ఆ వ్యక్తి గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా వీరిద్దరూ పాలకొండలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa