వేపాడ మండల కేంద్రంలో 108 వాహనానికి నిలువు నీడ లేక ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ ఉండాల్సిన పరిస్థితి నెలకొంటోంది. సకాలంలో రోగులను ఆసుపత్రికి తరలించే 108 వాహనానికి అధికారులు గాని ప్రజా ప్రతినిధులు గాని కనీసం షెల్టర్ ఏర్పాటు చేయకపోవడంపై స్థానికులు మండిపడుతూ అధికారులు, ప్రజాప్రతినిధుల చిత్తశుద్ధిని ప్రశ్నిస్తూ, ప్రజా రక్షక వాహనానికి సముచిత స్థానాన్ని కల్పిస్తూ, షెల్టర్ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.