ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కేసును సీబీఐకి అప్పగించాలని న్యాయస్థానంలో మృతుడి తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ విచారణ జరిగింది. ఎమ్మెల్సీ అనంతబాబు భార్యను ఎందుకు నిందితురాలిగా చేర్చలేదని ప్రభుత్వం తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. అదే విధంగా సీసీ ఫుటేజీలో ఉన్న వారిని ఎందుకు కేసులో చేర్చలేదన్న ధర్మాసనం కేవలం అనంతబాబును మాత్రమే చేర్చడం ఏంటని ప్రశ్నించింది.