అగ్రరాజ్యం అమెరికాను ఓ కొత్త రకం బాక్టీరియా వణికిస్తోంది. మనిషి ఒంట్లోని మాంసాన్ని తినేసే ఈ బాక్టీరియా కారణంగా న్యూయార్క్, కనెక్టికట్‌లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇది కలరా వ్యాధికి కారణమయ్యే బాక్టీరియా కుటుంబానికి చెందిన ‘విబ్రియో వల్నిఫికస్’ సముద్ర సంబంధిత ఆహారంలో ఉంటుందిని గుర్తించారు. ఈ బాక్టీరియా న్యూయార్క్ జలాల్లో చేరిందా? మరొక చోట ఉందా? అనే అంశాలపై పరిశోధనలు జరుగుతున్నాయి.