రాజాం నగరంలో స్థానిక శ్రీకాకుళం రోడ్డులోని ఎస్సీ హాస్టల్ విద్యార్థి గురువారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో రేగిడి మండలం పెద కోడిశకు చెందిన రవితేజ, వంగర మండలం బాగెంపేటకు చెందిన అరవింద్ హాస్టల్ నుంచి రాజాం వైపు రెండు సైకిళ్లపై వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. హాస్టల్ నుంచి బయలుదేరిన రెండు నిమిషాలలో ప్రమాదం చోటుచేసుకుంది. రవితేజ మృతి చెందగా... అరవింద్ స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. రవితేజ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా.. అరవింద్ ప్రథమ సంవత్సర విద్యార్థి. రవితేజ తండ్రి అప్పలరాజు చిన్నప్పుడే మృతి చెందాడు. తల్లి లక్ష్మి హైదరాబాద్‌లో కూలి పని చేస్తూ చదివిస్తోంది. వీరికి రవితేజ ఒక్కడే కుమారుడు. మరో రెండు రోజుల్లో హైదరాబాద్‌లో ఉంటున్న తల్లి వద్దకు వెళ్తానని మిత్రులకు చెప్పిన రవితేజ గురువారం రాత్రి హెయిర్ కటింగ్ చేయించుకునేందుకు వెళుతూ ప్రమాదానికి గురయ్యాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa