భారీ వర్షాలకు భారత్‌లో 2,038 మంది 2023లో చనిపోయారని కేంద్ర హోంశాఖ శుక్రవారం తెలిపింది. వరదలు, కొండ చరియలు విరిగి పడడం, పిడుగుల వల్ల వారంతా చనిపోయినట్లు పేర్కొంది. 892 మంది వరదల వల్ల, 506 మంది పిడుగులకు, 186 మంది కొండ చరియలు విరిగి పడడం వల్ల మృతి చెందినట్లు వెల్లడించింది. మృతుల సంఖ్య ఎక్కువగా బీహార్ (518), హిమాచల్ ప్రదేశ్ (330), గుజరాత్ (165) రాష్ట్రాల్లో ఉన్నట్లు తెలిపింది.